చౌటుప్పల్, ఆగస్టు 30 : చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని ఓటర్ల జాబితా, వార్డుల వారిగా విభజన సరైన పద్ధతిలో జరగలేదని తెలుపుతూ ఎంపీడీఓ సందీప్ కుమార్కు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ శనివారం వినతిపత్రం అందజేశారు. విభజన ప్రతిపాదిక తెలుపాలని కోరారు. దీని పై స్పష్టత లేనందున మరోసారి విశ్లేషించి జాబితాను రూపొందించాలని విన్నవించారు. అయన వెంట పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అల్మాస్పేట కృష్ణ, ఉపాధ్యక్షుడు చిన్నం బాలరాజు, మున్సిపాలిటీ యూత్ అధ్యక్షుడు తూర్పునూరి నరసింహ గౌడ్, నాయకుడు ఆరుట్ల లింగస్వామి పాల్గొన్నారు.