యాదగిరిగుట్ట, అక్టోబర్17 : ఏ మోహం పెట్టుకుని ఓట్లడుగుతారో కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆరె యాదగిరిగౌడ్, కోమటిరెడ్డి యువసేన జిల్లా అధ్యక్షుడు దార నవీన్నేత ఆధ్వర్యంలో 200 మంది, మల్లాపురం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పుచ్చుల రాజు, బరిగె సురేశ్, బావండ్ల రమేశ్ తోపాటు 100 మంది, గుండాల మండలం పాచిళ్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు సిరపురం సైదులు, మాజీ వార్డు సభ్యుడు పందుల వెంకటయ్య, బీజేపీ నాయకుడు నారగాని దయాకర్, కాంగ్రెస్ నాయకుడు సిరిపురం అఖిల్‌తోపాటు 150 మంది, వెల్మజాలకు చెందిన బీజేపీ నాయకుడు మేకల రమేశ్, వార్డు సభ్యుడు సంగి రాజేశ్, పాల సంఘం డైరెక్టర్ ఎనగందుల మల్లయ్యతోపాటు 200 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు.
గతంలో ఏం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతోపాటు రాష్ట్రం అంధకారంలో మగ్గడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యాదగిరిగుట్ట, గుండాల మండలాల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, ఖలీల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, మల్లాపురం గ్రామశాఖ అధ్యక్షుడు కర్రె బీరుమల్లయ్య, ప్రధాన కార్యదర్శి పిట్టల రాజు, గుండాల మాజీ జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మోత్కురు మార్కెట్ కమిటీ చైర్మన్ మూగల శ్రీనివాస్, పాచిల్ల సర్పంచ్ పందుల రేఖాయాదగిరి, అంబాల ఎంపీటీసీ పొన్నగాని మహేశ్, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ పందుల ఎల్లయ్య, పాచిల్ల గ్రామశాఖ అధ్యక్షుడు ఎలగందుల స్వామి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్, పీఏసీఎస్ డైరెక్టర్ సంగి బాలకొమురయ్య పాల్గొన్నారు.
రాజాపేట : మండలంలోని కొత్తజాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ ఠాకూర్ ధర్మేందర్‌సింగ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గంధమల్ల ఉప్పలయ్య, అల్దె బాలయ్య, గంగొళ్ల స్వామి, సుదగాని ఆంజనేయులుగౌడ్, ఠాకూర్ ధన్‌రాజ్‌సింగ్, ఠాకూర్ బాలాజీసింగ్, చెప్పాల కరుణాకర్, దాసరి విష్ణువర్ధన్‌రెడ్డి, అంకిరెడ్డి జహంగీర్, సుదగాని కరుణాకర్ ఉన్నారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి
తుర్కపల్లి : మోసపూరిత మాటలతో గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలంలోని మాదాపురం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దొంతుల సతీశ్, కాంగ్రెస్ యూత్ నాయకులు బద్రి సంతోష్, నరేశ్, ఆరె కర్ణాకర్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి సందెల్ల రమేశ్, కాంగ్రెస్ యూత్ నాయకులు సిద్దెంకి శ్రీకాంత్, ముదిరాజ్‌సంఘం అధ్యక్షులు లోకుల నర్సింహులు, మాజీ అధ్యక్షుడు అరె పెంటయ్య, మాజీ వార్డు సభ్యుడు లోకుల వర్ధయ్యతో పాటు దాదాపు 200 మంది బీఆర్ఎస్ యువజన నాయకుడు గట్టు తేజస్వీ నిఖిల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకు ముందు గ్రామంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భూసాని వెంకటేశ్, గూగులోతు మోతీరాం, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్ష, ఉపాధ్యక్షులు పోగుల ఆంజనేయులు, నామసాని సత్యనారాయణ, ఎంపీటీసీ గిద్దె కర్ణాకర్, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ నల్ల శ్రీకాంత్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జాలిగాం కృష్ణ, నాయకులు సీస రాజు, శ్రీకాంత్, చంద్రమౌళి, హరినాయక్, బాలింగం, బాల్‌నర్సింహ, గణేశ్, ఆంజనేయులు, పనగట్ల లక్ష్మణ్, భానుప్రకాశ్, మహేశ్, నాగరాజు పాల్గొన్నారు.
తుర్కపల్లి : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మాదాపూర్‌లో బతుకమ్మ ఆడారు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మనది అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీలారవీందర్, మహిళలు పాల్గొన్నారు.