బీబీనగర్, ఆగస్టు 18 : బీబీనగర్ పట్టణ కేంద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీబీనగర్ పట్టణ కేంద్రంలో రైల్వే ట్రాక్ పట్టణాన్ని రెండుగా విభజిస్తుందని ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్, స్కూల్స్, ఇతర మార్కెట్ అవసరాలకు ప్రజలు రైల్వే స్టేషన్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా ప్రయాణించాల్సి వస్తుందన్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగించుకోవడంలో ప్రజలు మహిళలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైల్వే టికెట్ చెకింగ్ అధికారులు స్క్వాడ్ వచ్చినప్పుడు రైల్వే ట్రాక్ దాటుతున్న బీబీనగర్ వాసులకు ఫైన్లు వేస్తున్నారని వాపోయారు. పాదచారులు, వాహనదారులు ఇక్కడ నుండి అక్కడికి ప్రయాణించాలంటే (2) రెండు కిలోమీటర్లు దూరంలో రంగపురం వద్ద ఉన్న ఆర్ఓబి ( రైల్వే ఓవర్ బ్రిడ్జి) ద్వారా ప్రయాణించాల్సి వస్తుందన్నారు.
బైపాస్ రోడ్డు నుండి లేడా బ్రాహ్మణపల్లి రోడ్డు నుండి గాని విద్యార్థులు, వృద్ధులు సొంత వాహనం లేని వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రయాణికులు గ్రామాన్ని చేరుకోవాలంటే కాలినడకన రెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగి చేరుకోవాల్సి వస్తుందన్నారు. పాత, కొత్త గ్రామానికి మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురువుతున్నారన్నారు.
పాత గ్రామానికి కొత్తగా ట్రాక్ అవతల ఏర్పడిన గ్రామానికి మధ్య అనువైన చోట రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్, బిఆర్ యస్ నాయకు చెంగల్ వెంకటకిషన్ రావు, మల్లగారి శ్రీనివాస్, అమృతం శివ కుమార్, గుంటిపల్లి లక్ష్మీనారాయణ, దేవరకొండ శ్రీనివాస్, దేవరుప్పల పృథ్వీరాజ్, మహమ్మద్ మిట్టు, పేరబోయిన నరేష్, పొట్ట అంజి, మర్రి శ్రీకాంత్, ఉడుత మహేష్, గోరుకంటి శివకుమార్, వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.