రాజాపేట, జూన్ 10 : మండల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం జనగాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం మండలంలోని పేదింటి విద్యార్థులకు తమ కళాశాలలో రాయితీపై ఉన్నత విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు. దాంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి, నాయకులు ఎర్రకోకుల జస్వంత్, బెడిద వీరేశం ఉన్నారు.