బీబీనగర్, ఆగస్టు 04 : నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం బీబీనగర్ ఎయిమ్స్ లో 60 మంది నర్సింగ్ అధికారులకు తల్లిపాల ప్రాముఖ్యతపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లీబిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం ఎంత అవసరమో వివరించారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు పట్టించాలన్నారు. మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు శ్రేష్టమన్నారు. డబ్బాపాలు వద్దు తల్లిపాలు ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ నితిన్ అశోక్ జాన్ పాల్గొన్నారు.