భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని శ్రీనివాస పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసు నమోదయింది. వారం రోజుల క్రితం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. సంబంధిత శాఖ అధికారులు పౌల్ట్రీ ఫామ్‌కు చేరుకుని తగిన చర్యలు చేపడుతున్నారు.