భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 03 : స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ బండి కృష్ణ గౌడ్, బీఆర్ఎస్ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి ధీరావత్ వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గుగులోతు కుమార్, ఇస్లావత్ బిక్కు నాయక్, గుగులోత్ అరుణ్, ధిరావత్ శ్రీకాంత్, ఇస్లావత్ అర్జున్, గరిసె నర్సింహా, మొగిలిపాక అశోక్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎదునోజు రాజానారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు పెద్దిరెడ్డి యాదగిరి, నాయకులు గరిసె జంగయ్య, ఉడుతల వాసుదేవ్, రెవల్లీ యాదగిరి, మొగిలిపాక సుధాకర్, ధిరావత్ మహేందర్, ధిరావత్ భూపాల్ పాల్గొన్నారు.