బీబీనగర్, ఏప్రిల్ 03 : పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు బీబీనగర్ పంచాయతీ కార్యదర్శి జాకీర్పై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సస్పెన్షన్ వేటు వేశారు. పట్టణంలో పారిశుధ్య పనులు సరిగ్గా నిర్వహించక పోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.