భువనగిరి ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో రెండో విడత అడ్మిషన్లు
భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా (2025-26) ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు..
భూదాన్ పోచంపల్లి, జూన్ 09 : భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా (2025-26) ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ నెల 11వ తేదీన నేరుగా అడ్మిషన్ ఎంపిక ప్రక్రియకు హాజరు కావొచ్చని కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 6 గంటలకు కళాశాలను చేరుకోవాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి, ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. అభ్యర్థి కనీస ఎత్తు 152 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని, ఎలాంటి కంటి దోషములు, ఆనారోగ్య సమస్యలు ఉండరాదన్నారు. శారీరక సామర్థ్య పరీక్షలకు అనుకూలంగా ఉండేలా అభ్యర్థులు ట్రాక్ ప్యాంటు, టీ-షర్ట్, షూస్ ధరించి రావాలని, అన్ని సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

