కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ (వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా డిపార్ట్మెంటల్ అథ్లెటిక్స్ పోటీలు సోమవారం రుద్రంపూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఏరియా జనరల్ మేనేజర్..
రుద్రంపూర్, అక్టోబర్ 26 : డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ (వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా డిపార్ట్మెంటల్ అథ్లెటిక్స్ పోటీలు సోమవారం రుద్రంపూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పోటీలను డీవైపీఎం, అసోసియేషన్ గౌరవ కార్యదర్శి జి.హరీష్, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ కె.రాములు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జి.హరీష్ మాట్లాడుతూ.. అథ్లెటిక్స్ వ్యక్తిగత ప్రతిభకు పరీక్ష అని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులే విజేతలుగా నిలుస్తారన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. రీజినల్, కంపెనీ స్థాయి పోటీలతో పాటు కోల్ ఇండియా స్థాయిలోనూ కొత్తగూడెం ఏరియా క్రీడాకారులు అధిక సంఖ్యలో బహుమతులు సాధించి ఏరియాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యూనియన్ ప్రతినిధులు పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సందబోయిన శ్రీనివాస్, జనరల్ కెప్టెన్ రాజశేఖర్, క్రీడాకారులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

