‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాల విషయంలో విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోదాడ కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ కె.సురేశ్ అన్నారు. సోమవారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సురక్షిత్ బచపన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోదాడలోని...
– సీనియర్ సివిల్ జడ్జ్ కె.సురేశ్
కోదాడ, అక్టోబర్ 26 : పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాల విషయంలో విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోదాడ కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ కె.సురేశ్ అన్నారు. సోమవారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సురక్షిత్ బచపన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోదాడలోని అశోక్ నగర్లో గల కే, టి, ఎస్ స్కూల్లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి సురేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరూ మంచి స్పర్శ చెడు స్పర్శలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు.
పిల్లల భద్రత, వారికున్న చట్టపరమైన రక్షణలు అలాగే హక్కుల గురించి విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు మాట్లాడుతూ.. ప్రస్తుత సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థులు ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ సదస్సులో.పాఠశాల ప్రిన్సిపాల్ బాణాల కోటిరెడ్డి, చిలకా రమేశ్, అకడమిక్ ఇన్చార్జి రాజా, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, న్యాయ సేవల కమిటీ సభ్యులు, ప్రభుత్వ న్యాయవాదులు, ప్యానెల్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

