‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
బూర్గంపాడులో నిర్మించే కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకి అపార నష్టం కలిగే అవకాశం ఉందని, ఈ కట్ట వల్ల రైతులకు కష్టం జరుగుతుందని, వారందరికీ పోలవరం ప్యాకేజీ అందజేయాలని సిపిఎంర బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో...
– రైతులకు పోలవరం ప్యాకేజీ అందించాలి
– ఎమ్మెల్యే పాయం వేంకటేశ్వర్లుకు సిపిఎం బృందం వినతి
బూర్గంపహాడ్, అక్టోబర్ 26 : బూర్గంపాడులో నిర్మించే కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకి అపార నష్టం కలిగే అవకాశం ఉందని, ఈ కట్ట వల్ల రైతులకు కష్టం జరుగుతుందని, వారందరికీ పోలవరం ప్యాకేజీ అందజేయాలని సిపిఎంర బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిపిఎం బృందం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వ ర్లుకు వినతి పత్రాన్ని అందజేసింది. సోమవారం బూర్గంపాడు మార్కెట్ కమిటీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరకట్ట నిర్మాణ విషయంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని సమావేశాలు ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టాలన్నారు.
ఈ కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు ప్రమాదం పొంచి ఉందని ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన అన్నారు. బూర్గంపాడు నిర్మించే కర్కట నిర్మాణం వల్ల మండలంలోని బుడ్డగూడెం,సోంపల్లి గ్రామాలకు ప్రమాదం ఉంచి ఉందన్నారు. బ్యాక్ వాటర్ వల్ల బూర్గంపాడు ప్రాంతం ముంపునకి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విషయాలపై స్పష్టమైన వైఖరిని తెలపాలని, ఆ తర్వాత పనులు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేకుల చెరువు గ్రామ సర్పంచ్ బోళ్ల సైదమ్మ, సిపిఎం మండల కమిటీ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు, బోళ్ల శ్రీశైలం పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

