Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
Harish Rao | ఎల్ నినో పేరిట ప్రజలను భయపెట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. దేవాదులలో సమ్మక్క బ్యారేజ్ నుంచి మీరు నీళ్లు ఎందుకు ఎత్తలేదని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Harish Rao | ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజులు 24 గంటలు నిరాటంకంగా పట్టిసీమ మోటార్ల ద్వారా నీళ్లెత్తిర్రు.. గోదావరి, కృష్ణా డెల్టాలను కాపాడుకున్నరు.. అని పత్రికల్లో చదివాం.
చంద్రబాబు నాయుడు 100 రోజులు పట్టిసీమ ద్వారా నీళ్లు ఎత్తి ఏపీకి కరువు లేకుండా చేశారు. మరి అదే గోదావరి నదిమీద పట్టిసీమ పైభాగంలో సమ్మక్క బ్యారేజ్ కట్టి, దేవాదుల ఫేజ్ 3 కూడా పూర్తి చేసి మీ చేతిలో పెట్టారు. మరి మీరు ఎన్ని రోజులు మోటార్లు నడిపారు. ఎన్ని గంటలు మోటార్లు నడిపారు.. ఎన్ని నీళ్లు ఎత్తారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మనం ఒడిసిపడితే కిందికి పట్టిసీమకు, ఆంధ్రాకు నీళ్లు పోనే పోవు కదా..మీరుఎత్తుకున్నంక మిగిలితేనే కిందికి పోవాలే. మరి 100 రోజులు 24 గంటలు పట్టిసీమ మోటార్లు నడిపి ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎత్తింది ఎట్లా..?
దేవాదులలో సమ్మక్క బ్యారేజ్ నుంచి మీరు నీళ్లు ఎందుకు ఎత్తలేదని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎల్ నినో పేరిట ప్రజలను భయపెట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదని హరీశ్ రావు మండిపడ్డారు.
ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ
చంద్రబాబు నాయుడు 100 రోజులు పట్టిసీమ ద్వారా నీళ్లు ఎత్తి ఏపీకి కరువు లేకుండా చేశారు
మరి అదే గోదావరి నది మీద ఉన్న దేవాదుల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేశారు, ఎన్ని గంటలు మోటర్లు నడిపారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి
ఎల్ నినో పేరిట ప్రజలను భయపెట్టడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2026
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
వృద్ధుల పింఛన్ నగదుతో ఉడాయించిన కేటుగాడు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

