బీబీనగర్, జూన్ 03 : భూమి సమస్యలు భూ భారతితో పరిష్కారం అవుతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా బీబీనగర్ మండలంలోని మహదేవ్పూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రైతులందరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాలకు వచ్చే రెవెన్యూ అధికారులు సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు. ప్రతి రైలుకు మేలు చేసే విదంగా భూ భారతి చట్టం రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి, తాసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, నాయకులు గోలి పింగళ్‌రెడ్డి, పొటోళ్ల శ్యామ్‌గౌడ్, దండెం ప్రభాకర్ పాల్గొన్నారు.