రాజాపేట, ఏప్రిల్ 12: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) అన్నారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పించడం ద్వేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. శనివారం రాజాపేట మండలంలోని పాముకుంట, సింగారం, మల్లె గూడెం, కుర్రారం, కొత్తజాల, జాల గ్రామాలలో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆలేరును అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ప్రతి పేదోడికి ఆకలి తీర్చాలని గొప్ప సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. త్వరలోనే మండలానికి సాగు జలాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రేణుక పెంటయ్య గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు విట్టల్ నాయక్, సిల్వర్ బాల్ రాజ్ గౌడ్, రైతు సమితి మండల అధ్యక్షుడు గౌటే లక్ష్మణ్, గౌర బక్కయ్య, బొంత సుధాకర్ భీమ గాని బాల నరసయ్య, రాంజీ నాయక్ రంగ నరేష్ గౌరయ్య నమిల కేదారి, అంకతి బాలయ్య నాగారం రేణుక ఠాకూర్, ఉపేంద్ర తదితరులున్నారు.