రాజాపేట, సెప్టెంబర్ 23 : పండుగల సమయంలో ఊర్లకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని యాదగిరిగుట్ట రూరల్ పరిధిలో నిఘాతో పాటు రాత్రి సమయాల్లో గస్తీని మరింత పెంచినట్లు వెల్లడించారు. జన సంచారం తక్కువగా ఉండే కాలనీలు, బస్తీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. విలువైన బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్లలో లేదా వెంట తీసుకు వెళ్లాలని సూచించారు. ప్రజలు తమ వంతు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.