ఆలేరు టౌన్, సెప్టెంబర్ 17 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బహుదూర్ పేటలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆలేరు మండల కన్వీనర్ గంగాధరి సుధీర్ కుమార్, కో కన్వీనర్ జివికపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. సమావేశంలో బహుదూర్ పేట గ్రామ శాఖ నూతన కమిటీ అధ్యక్షుడిగా కొరుటూరు ఉపేందర్, ఉపాధ్యక్షుడిగా కొరుటూరు ఉదయ్ కిరణ్, ప్రధాన కార్యదర్శిగా కొరుటూరు ఉదయ్ కుమార్, కోశాధికారిగా కొరుటూరు శివకుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మండల కన్వీనర్ గంగాధరి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. కుమ్మరులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికపరంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కుమ్మర్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. కుమ్మర్ల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొరుటూరు బాలరాజ్, కొరుటూరు శ్రీనివాస్, సాయి గూడెం అధ్యక్షుడు గంగాధరి పరమేశ్, గంగాధరి కిరణ్ కుమార్, గంగాధరి సాగర్ పాల్గొన్నారు.