ఆలేరు టౌన్, మార్చి 12 : ఆలేరు పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప దేవాలయంలో బుధవారం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మొరిగాడి వెంకటేశ్ మాట్లాడుతూ.. అయ్యప్ప ఆలయంలో ప్రతి బుధవారం అన్నసంతర్పణ నిర్వహిస్తామని తెలిపారు.
యాదాద్రి జిల్లాలో అతిపెద్ద ఆలయంగా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని భక్తుల సహకారంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. దాతలు సహకారం అందిస్తే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పత్తి వెంకటేశ్, బోడపట్ల సిద్ధులు, సీసా ప్రవీణ్ కుమార్, బండ శ్రీనివాస్, ఎర్రం నరసింహారెడ్డి, పుప్పాల నవీన్, బోడపట్ల రాజు, పత్తి విష్ణువర్ధన్, కూడికలు రాజీవ్, ఆలేటి అజయ్, బోడపట్ల రాజశేఖర్, కేంగార్ల కుమార స్వామి, చిన్నం రాజు పాల్గొన్నారు.