బీబీనగర్, అక్టోబర్ 23 : కుష్టు వ్యాధి వ్యాప్తి నివారణపై అవగాహన పెంచుకోవాలని బీబీనగర్ పీహెచ్సీ డాక్టర్ మౌనికరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కళాశాలలలో జిల్లా నూక్లీయస్ టీమ్ ఆధ్వర్యంలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించి స్క్రీనింగ్ నిర్వహించారు. కుష్టు వ్యాధి లక్షాణాలు ఉన్నవారెవరైనా బహుళ ఔషద చికిత్సను ఆరు లేదా పన్నెండు నెలల పాటు తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. దీంతో అంగ వైకల్యం రాకుండా నివారించవచ్చన్నారు.
ఈ మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించబడుతాయన్నారు. వ్యాధి అనుమానిత లక్షణాలు ఉన్నవారు స్థానిక వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. కుష్టు వ్యాది సుంపూర్ణ నిర్ములనకు వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని విద్యార్దుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల హెడ్ మాస్టర్లు మాధవి, రూప, మెడికల్ ఆఫీసర్లు రాములు, అనిత, మాధవి, రమేశ్ నాయక్, ఎంపీహెచ్ఏ, ఆశాలు ఆరోగ్యమ్మ, వసంత, గంగాలక్ష్మి, ఇందిర, అనురాధ, లావణ్య పాల్గొన్నారు.