రామన్నపేట, జులై 10 : ఈ నెల 14 నుండి నిర్వహించనున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రామన్నపేట మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఆవరణలో సమ్మె పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ నాయకులు మాట్లాడుతూ.. ఒకే వ్యవస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయం అన్నారు. వెంటనే స్టాండింగ్ ఆర్డర్స్ ను రద్దు చేసి ఏపిఎస్ఈబి రూల్స్ వర్తింపజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని కర్ణ, చిన్నారావు, గోలి కృష్ణ, కిషన్, ఎండి అస్లం మిర్జా, అర్షద్ బేగ్ పాల్గొన్నారు.