యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): 57 ఏండ్లు ఉన్న వారు పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతం వారు రూ.2లక్షలకు లోబడి వార్షిక ఆదాయం ఉండాలి. 3 ఎకరాల తరి, 7.5 ఎకరాల కంటే తక్కువ ఖుష్కి భూమి కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, వృత్తి పరమైన హోదాలో ఉన్న కుటుంబాలు, పెద్ద వ్యాపారాలు కలిగినవారు,
4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలు కలిగిన వారు, కుటుంబంలో ఇతర పెన్షన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు అనర్హులు. అర్హత కలిగిన వారు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన తర్వాత పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.