నల్లగొండ : జిల్లాలోని భువనగిరి మండలం నందనం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ‘నీరా ప్లాంట్’కు దివంగత బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్(మాజీ ఎంపీ) పేరు పెట్టాలని గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు.. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిని కోరారు.
వెంటనే ఆయన స్పందించి ఎక్సైజ్ శాఖ మంత్రితో మాట్లాడారు. కాగా, హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి ధర్మభిక్షం గౌడ్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు గౌడ సంఘాల నేతలు తెలిపారు.