బీబీనగర్, డిసెంబర్ 02 : క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఇద్దరు నేతలను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసినట్టు ఆ పార్టీ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ బీబీనగర్ పార్టీ పట్టణ ఇన్చార్జి, అధ్యక్షుడు గోలి సంతోష్‌రెడ్డి, మహమ్మద్ కుతుబుద్దీన్ ఇరువురు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్దంగా ఎవరూ పనిచేసినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.