చౌటుప్పల్: యాదాద్రి నేచురల్ మోడల్ ఫారెస్ట్ తరహా లాంటి చిట్టడవులను రాష్ట్రమంతా పెంచేలా ఏర్పాట్లు చేస్తు న్నామని సీఎంవో మఖ్య కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. స్థానిక ఫారెస్ట్ కార్యాలయాన్ని ఆమె బుధవారం సందర్శిం చారు. ఫారెస్ట్, రెవిన్యూ, మండల పరిషత్ అధికారులతో హరితహారంపై సమీక్షించారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి తెలిపారు. ఎప్పటికప్పుడూ హరితహారంపై సీఎంవో అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరితహారంలో రాష్ట్రమంతా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టామన్నారు. గ్రామాలన్ని పచ్చగా మారాయని తెలిపారు. మున్సిపాలిటీ కేంద్రంలోని యాదాద్రి నేచురుల్ ఫారెస్ట్‌లో కేవలం రెండేళ్లలో 5వేల మొక్కలతో చిట్టడవిని తయారు చేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చిట్టడువులను అన్ని మండలాల్లో పెంచేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పల్లె పకృతి వనాల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టామన్నారు.
గ్రామాల్లో పెంచిన మొక్కలను సంరక్షించాల్సిన భాద్యత ప్రజలపై కూడా ఉంటుందన్నారు. మొక్కల పెంపకం బాధ్యతగా చేపట్టాలని తెలిపారు. మున్సిపాలిటీ, మండల వ్యాప్తం గా మొక్కల సంరక్షణ బాగా జరుగుతుందని కితాబిచ్చారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, సీసీఎఫ్ ఎంజే అక్బర్, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.