భువనగిరి అర్బన్: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలలోని ఆలేరు పరిధిలో అంగన్వాడీ సహాయకురాలు 2 పోస్టులు, మోత్కూర్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ 1 పోస్టు, రామన్నపేట ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ 1 పొస్టు, మిని అంగన్వాడీ టీచర్ 1 పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులకు అర్వులైన మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై వయస్సు 01-07-2021 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉం డాలని, ఎస్ఎస్సీ మెమో, కుల, నివాస, సదరము(దివ్యాంగులైతే), అనాధ అయితే అనాధ దృవపత్రాం, వితంతువైతే భర్త మరణ దృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో దృవీకరించిన పత్రాలను ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు వైబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆన్లైన్లో అప్లోడ్ (దరఖాస్తు) చేయని దృవీకరణ పత్రాలు తిరస్కరించబడు తాయని, మరిన్ని వివరాలకు జిల్లా సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ నోటిఫికేషన్ రద్దు పరుచుటకు, మార్పులు చేయుటకు గాను జిల్లా కలెక్టర్, చైర్మన్ జిల్లా గారికి పూర్తి అధికారం ఉంటుందని తెలిపారు.