రాజాపేట, జనవరి 23 : రాజాపేట మండల కేంద్రంలోని 1 -3 అంగన్వాడీ కేంద్రాలతో పాటు రఘునాధపురం అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఐసీడీఎస్ పీడీ నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యే పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ పిల్లల బరువుతో పాటు వారి కొలతలను పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలతో పాటు పిల్లలకి అందించే పోషకాహారాల గురించి అడిగి తెలుసుకున్నారు. సరుకుల నాణ్యతను పరిశీలించి మెరుగైన సేవలందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట వెంట సీడీపీఓ రేకుల స్వరాజ్యం, సూపర్వైజర్ జంగమ్మ, అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, భారతి, సుజాత ఉన్నారు.