భూధాన్ పోచంపల్లి, మార్చి 18 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎమిటీ యూనివర్సిటీ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థుల బృందం కొనియాడింది. స్టడీ టూర్లో భాగంగా ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 మంది విద్యార్థుల బృందం మంగళవారం భూదాన్ పోచంపల్లిని సందర్శించింది. పోచంపల్లి చేనేత సహకార సంఘం, కళా పునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, టూరిజం పార్క్, చేనేత వస్త్ర సముదాయం, చేనేత కళాకారుల గృహాలను వారు సందర్శించారు.
స్థానిక కళా పునర్వి హ్యాండ్లూమ్ యూనిట్లో చేనేత మగ్గాలు, రంగుల అద్దకం, నూలు తయారీ, చిటికి చుట్టడం, గ్రాఫ్ డిజైన్, చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను వారు పరిశీలించారు. చేనేత కళాకారుల నైపుణ్యం అత్యద్భుతమని ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ బృందానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ దీపిక మార్గదర్శనం చేశారు.
Amity University : పోచంపల్లిని సందర్శించిన ఎమిటీ యూనివర్సిటీ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు
Amity University : పోచంపల్లిని సందర్శించిన ఎమిటీ యూనివర్సిటీ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు
Amity University : పోచంపల్లిని సందర్శించిన ఎమిటీ యూనివర్సిటీ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు