అంబేద్కర్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
అంబేద్కర్ భవనంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని..
భువనగిరి అర్బన్, జూలై 06 : అంబేద్కర్ భవనంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భవనం నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన నిర్మాణ పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, ఇంకా పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ భవనానికి అవసరమైన మౌలిక వసతులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనం ముందు సీసీ రోడ్డు నిర్మాణం, గ్రీనరీ అభివృద్ధి, పరిసరాల సుందరీకరణ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భవనాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడే విధంగా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

