Abhijeet Dipke | మరోసారి నిలిచిపోయిన సీజేపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్.. పిరికిచర్యగా అభివర్ణించిన దీప్కే
Abhijeet Dipke : కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ శనివారం కొద్దిసేపు నిలిచిపోయింది. ఈ విషయాన్ని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. సీజేపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిలిపివేయడాన్ని పిరికిపంద చర్యగా అభిజీత్ దీప్కే వర్ణించారు.
Abhijeet Dipke : కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ శనివారం కొద్దిసేపు నిలిచిపోయింది. ఈ విషయాన్ని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. సీజేపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిలిపివేయడాన్ని పిరికిపంద చర్యగా అభిజీత్ దీప్కే వర్ణించారు. అయితే, కొంతసేపటి తర్వాత అకౌంట్ తిరిగి ప్రారంభమైంది. ఈ అంశంపై దీప్కే స్పందించారు.
సీజేపీ అకౌంట్ నిలిచిపోవడానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆయనతోపాటు సీజేపీ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 6.16 గంటలకు సీజేపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిలిచిపోయింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో 6.45 గంటలకు ఖాతా తిరిగి పునరుద్ధరించారు. భారత స్వాతంత్య్ర దినం రోజున తమ గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని, ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని దీప్కే ప్రకటించారు. ఇది పిరికపందలు చేసిన చర్యగా అభివర్ణించారు. అలాంటివారు సీజేపీని అడ్డుకునేందుకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకోవడం సిగ్గు చేటు అన్నారు.
🚨CJP Instagram handle was taken down this morning 🚨
But we have been able to successfully recover the account.
What a shame that those who oppose CJP chose India’s Independence Day to try to muzzle our voice.
We will not be intimidated by such cowardly acts! ✊ https://t.co/Wz3rhExHpu
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) August 15, 2026
ఇంతకుముందు కూడా సీజేపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్ష సందర్భంగా సీజీపీ ఖాతా ద్వారా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో కేంద్రం ఈ ఖాతాను బ్లాక్ చేసింది. అనంతరం గత జూలైలో కోర్టు ఖాతాను పునరుద్ధరించాలని ఆదేశించడంతో ఈ అకౌంట్ తిరిగి ప్రారంభమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

