భువనగిరి కలెక్టరేట్: అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. తన భార్యతో వేరొక వ్యక్తి అక్రమ సంబంధం నెరుపుతు న్నారని అతి దారుణంగా హత్య చేసిన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకున్నది. ఘటన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలంలో ని కొరటికల్కి చెందిన మృతుడు చిన్నం అర్జున్, పెద్దింటి అశోక్‌రెడ్డి, బండ సురేశ్, లగ్గాల రవి, నిషాంత్‌రెడ్డి, బూషి సాయి చిన్ననాటి నుంచి స్నేహితులు కాగా మృతుడు అర్జున్‌కు కొంతకాలం నుంచి భార్యతో కోర్టు కేసు నడుస్తుంది.
కాగా కోర్టు పనుల నిమిత్తం మృతుడు అర్జున్ అతని స్నేహితుడు పెద్దింటి అశోక్ రెడ్డితో కలసి పలుమార్లు కారులో వెళు తుండేవాడు. ఈ క్రమంలో అశోక్‌రెడ్డి భార్య శిరీషతో అర్జున్ అక్రమ సంబంధం కొనసాగిస్తూ చనువుగా ఉండటాన్నిజీర్ణించు కోలేకపోయాడు. ఈ విషయాన్నిఅశోక్రెడ్డి.. తన స్నేహితుడు బండ సురేశ్‌కు చెప్పి అర్జున్ను హత్య చేసేందుకు పథకం ప న్నారు. సురేశ్ అతని మామ ఉడుత నర్సింహ, బావ మరిది ఉడుత నవీన్‌లతో కలిసి నెల రోజులు రెక్కీ నిర్వహించారు.
కాగా ఈ నెల 14వ తేది రాత్రి 8గంటల సమయంలో సురేశ్.. అర్జున్ వద్దకు వచ్చి అశోక్‌రెడ్డి అన్న షెడ్డు వద్ద బీర్లు తా గడానికి వెళ్తున్నామని నమ్మబలకడంతో అర్జున్ ఒంటరిగా గ్రామ సమీపంలోని చుంచు దుర్గయ్య వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో అశోక్‌రెడ్డి, బండ సురేశ్, శిరీష, నర్సింహ, నవీన్, మల్లెపూల శ్రీశైలంలు ద్విచక్ర వాహనా లపై రావడంతో అర్జున్‌కు అనుమానం వచ్చి ద్విచక్ర వాహనంపై పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు.
ఈలోపే అశోక్‌రెడ్డి పథకం ప్రకారం చేతిలోని కర్రతో అర్జున్ ముఖంపై బలంగా కొట్టడంతో కింద పడిపోగా సురేశ్ చేతిలోని స్టీల్ కడియంతో విచక్షణా రహితంగా అర్జున్ ముఖంపై, ముక్కుపై కొట్టాడు, అశోక్‌రెడ్డి మృతుడు అర్జున్ కడుపు మీద కూర్చుని కర్రతో అర్జున్ ఎడమ ఛాతిపై విచక్షణా రహితంగా కొట్టాడు. ఎంతకీ ప్రాణం పోట్లేదని అశోక్‌రెడ్డి అతని భార్య శిరీ ష, నర్సింహ, నవీన్, శ్రీశైలంలను ఎవరూ రాకుండా చూడాలని చెప్పి అర్జున్ గొంతు, ముఖంపై తీవ్రంగా దాడి చేశాడు.
అనంతరం అర్జున్ మృతి చెందాడని నిర్ధారణ చేసుకుని హత్యకు ఉపయోగించిన కర్రను పక్కనే పొలంలో పడేసి పారి పోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు బుధవారం ఆత్మకూర్(ఎం) మండలంలోని తిమ్మాపూర్ చౌరస్తాలో నింది తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కర్ర, చేతి కడియం, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.