భూదాన్‌పోచంపల్లి: మండలం వ్యాప్తంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, శివారెడ్డిగూడెం గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం లోని భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్ మండలాలకు కలిపి రూ. 15 కోట్ల హెచ్ఎండీఏ నిధులు మంజూరయ్యాయని, అందులో నుంచి భూదాన్‌పోచంపల్లి మండలానికి రూ. 5 కోట్లు కేటాయించామన్నారు.ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడానికి నిధులు కేటాయిస్తు న్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరయ్యాయన్నారు.
శివారెడ్డిగూడెంలో చిన్నేటి మూసీకాల్వపై బ్రిడ్జి నిర్మాణం కోసం పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, పోచంపల్లి సింగిల్‌విండో చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సామ రవీంరదర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవీశ్రీశైలంగౌడ్, రైతు వేదిక అధ్యక్షుడు రావుల శేఖర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పగిళ్ల సుధాకర్‌రెడ్డి, ఐతరాజు భిక్షపలి, నోముల మాధవరెడ్డి, సర్పంచ్‌లు పీసర్ల మంజుల, దోటి కుమార్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు ముత్యాల మహిపాల్‌రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, ఆర్ల లింగస్వామి యాదవ్, యాదగిరి, సుర్వి కాటంరాజు గౌడ్ పాల్గొన్నారు.