రాజాపేట, ఏప్రిల్ 12 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాజేపట మండల కేంద్రంలో హనుమకొండ జిల్లా ఎలకుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గులాబీ శ్రేణులు దండుగా కదిలి వచ్చి సభను విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, సెక్రటరీ భాస్కర్ గౌడ్, గుంటి మధుసూదన్ రెడ్డి, ఠాగూర్ ప్రమోద్ సింగ్, ఎర్రగోకుల జస్వంత్, గోపగాని యాదగిరి గౌడ్, బెడిదే వీరేశం, కట్కం స్వామి, ఏమ్మా భాస్కర్, గొల్లూరి శ్రీకాంత్, షాగర్ల పరమేశ్, గోపగాని శ్రీనాథ్, గంధమల సురేశ్, అబ్దుల్, ఆబిద్ పాల్గొన్నారు.