బీబీనగర్, నవంబర్ 1 : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను మండల కేంద్రంలోని పెద్ద చెరువులో సోమవారం సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మితో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను వదులుతుందన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ జిల్లా అధికారి రాజ్‌కుమార్, మండల కో ఆప్షన్ సభ్యుడు అక్బర్, ఉప సర్పంచ్ దస్తగిరి, వార్డు సభ్యులు బెండె ప్రవీణ్, సామల వేణు, రఘు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నారగోని మహేశ్, ప్రధాన కార్యదర్శి గోలి సంతోష్‌రెడ్డి, మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడు కుశంగుల గణేశ్, నాయకులు కాసుల సత్యనారాయణగౌడ్, ఎలుగల నరేందర్ పాల్గొన్నారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి: వలిగొండ జడ్పీటీసీ పద్మ
వలిగొండ : ప్రభుత్వం అందించే సహాయంతో మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసిన 3 లక్షల చేప పిల్లలను సోమవారం మండల కేంద్రంలోని అక్కాచెల్లెళ్ల చెరువులో వదిలారు. సర్పంచ్ బోళ్ల లలిత, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సోమనబోయిన సతీశ్, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమత, టీఆర్ఎస్ నాయకులు రత్నయ్య, రవీంద్ర, లింగస్వామి, భిక్షపతి, రాంచంద్రం, ఆనంద్ పాల్గొన్నారు.