మోటకొండూర్, జూలై 11:టీఆర్ఎస్కేవీతోనే కార్మికుల సమస్యలు పరిషారమవుతాయని డీసీసీబీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో టీఆర్ఎస్ కేవీ నూతన కమిటీని ఆ కంపెనీ కార్మికులు శుక్రవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును, అధ్యక్షుడిగా గొంగిడి మహేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక లోకానికి టీఆర్ఎస్కేవీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్మికులకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కంపెనీ అభివృద్ధికి కార్మికులు వెన్నెముకలాంటివారిని, కార్మికుల శ్రమను గుర్తించి కంపెనీల యాజమాన్యాలు కనీస వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికుల వేతనాల పెంపుపై సంబంధిత యాజమాన్యాలతో చర్చిస్తామని చెప్పారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని, కార్మికుల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.
అనంతరం టీఆర్ఎస్ కేవీ జెండాను ఆవిషరించారు. నూతన కమిటీలో జనరల్ సెక్రటరీలుగా కాదురి ఎలేందర్, పచ్చిమట్ల రాజు, ఉపాధ్యక్షులుగా గంధమల్ల నాగరాజు, గుండబోయిన నరేశ్, తుడుం దశరథ, కోశాధికారిగా కంకటి శివ, సహయకార్మదర్శులుగా కొరుకోప్పుల నవీన్, బర్మల నవీన్, బర్మల శ్రీధర్, సిరబోయిన పవన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సోమారపు దుర్గాప్రసాద్, భీమగాని నవీన్, పరకాల నాగరాజు, గుర్రం గణేశ్, సభ్యులుగా భూపాల్, శ్రీధర్, భరత్, మహేశ్, క్రాంతి, ప్రశాంత్, నవీన్, సాయినిఖిల్, నిఖిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మాజీ ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, కాటేపల్లి మాజీ సర్పంచ్ మంత్రి రాజు, బీఆర్ఎస్ నాయకులు అనంతుల జంగారెడ్డి, ఎగ్గిడి కృష్ణ, బీస కృష్ణంరాజు, జివిలికపల్లి వెంకటేశ్ తదితరులు ఉన్నారు.