కట్టంగూర్, నవంబర్ 24 : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలకు ప్రభుత్వ సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, డీపీఎం మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు, డిప్యూటీ తాసీల్దార్ అల్బట్ ప్రాంక్లిన్, ఏపీఎం రాములు, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బండారు కృష్ణ, గుండు పరమేశ్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య పాల్గొన్నారు.