కట్టంగూర్, ఆగస్టు 22 : మహిళలు అన్ని రంగాల్లో రాణించి అర్ధికంగా ఎదగాలని నాబార్డు తెలంగాణ సీజీఎం బి.ఉదయభాస్కర్ అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఆప్- గ్రీడ్ సోలార్ సిస్టంను శుక్రవారం ఆయన ప్రారంభించి కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్పీఓ రైతులకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తూ, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు చెప్పారు.
త్వరలో ప్రారంభించబోయే కృషి వికాస్ స్కిల్ అభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిరుద్యోగ యువతకు మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు నల్లగొండ డీడీఎం వినయ్ కుమార్, సూర్యాపేట డీడీఎం రవీంద్ర నాయక్, ఎఫ్పీఓ చైర్మన్ సైదమ్మ, సలహాదారులు నంద్యాల నర్సింహరెడ్డి, ఐఆర్డీఎస్ అధ్యక్షుడు రమేశ్, సీఈఓ రమేశ్, స్వచ్ఛ శక్తి సుధాకర్, కోనం ఫౌండేషన్ షభ్యుడు నరేశ్, రైతులు, మహిళలు పాల్గొన్నారు.