రాజాపేట, ఫిబ్రవరి 21 : మండలంలోని పాముకుంటకు చెందిన మహిళా రైతు రంగ కళమ్మకు 1.28 ఎకరాల భూమి ఉన్నది. ఉన్న మొత్తం భూమిలో వరి సాగు చేసింది. ఈ భూమికి రైతు భరోసా రూ. 11,362 రావాల్సి ఉండగా రూ. 1,012 మాత్రమే పడ్డట్టు సెల్ఫోన్లో మెసేజ్ వచ్చింది.
బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్లో చూ డగా రూ. 1,012 పడ్డాయని, మండల వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి అడుగగా మొత్తం రైతు భరోసా పడ్డట్లు ఆన్లైన్లో చూపిస్తున్నదని కళమ్మ తెలిపింది. ఈ విషయంపై వ్యవసాయాధికారులు చేతు లు దులుపుకున్నారని, రైతు భరోసా డబ్బుల కోసం ఎవరిని అడుగాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.