రాజాపేట, సెప్టెంబర్ 27: రాజాపేటలో (Rajapeta) విద్యుదాఘాతంతో మహిళా మృతి చెందింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని గొర్రెకలపల్లి గ్రామానికి చెందిన సంపంగి తిరుపతయ్య, అండాలు దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి జీవనోపాధి కోసం రాజాపేటకు వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నారు. ఒక బ్రిక్స్ కంపెనీ వద్ద పూరి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. కాగా, శనివారం ఉదయం మంచి నీటి కోసం పక్కనే ఇంటికి వెళ్లిన అండాలు (47).. నీళ్లు తీసుకుని తిరిగి పయణమైంది.
ఈ క్రమంలో కిందికి వేలాడుతున్న జీ వైర్‌ను పైకి ఎత్తుతుండగా విద్యుదాఘాతానికి గురైంది. పక్కనే ఉన్నవారు గమనించి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ దవాఖాన తరలించారు.