పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. రూ.300 కోట్లతో రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. సుమారు వెయ్యి ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. మిషన్ భగీరథ కింద రూ.435 కోట్లతో 243 గ్రామాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు.
దేవరకొండ ఏరియా ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా నూతనంగా డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేసి మరిన్ని సేవలు అందిస్తున్నారు. గతంలో డయాలిసిస్ కేంద్రం లేక హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.
నియోజకవర్గంలోని గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 4పల్లె, 2 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ దవాఖానల్లో వైద్యుడు, నర్సుతోపాటు మరో వ్యక్తి అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు.
నియోజకవర్గంలో 1100 మందికి రూ.110 కోట్ల విలువైన దళితబంధు యూనిట్లు మంజూరు చేశారు. బీసీబంధు కింద 300 మందికి రూ.3 కోట్ల నిధులను చెక్కుల రూపంలో అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,080 మందికి రూ.10.33 కోట్లు పంపిణీ చేశారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 1,690 మందికి రూ.26.55 కోట్లు అందజేశారు.
ఉమ్మడి పాలనలో వర్షాలు పడితేనే డిండి ప్రాజెక్ట్‌లోకి నీరు వచ్చి పంటలు పండేవి. స్వరాష్ట్రంలో కల్వకుర్తి ఎత్తిపొతల ద్వారా డిండి ప్రాజెక్ట్‌ను నింపి సాగునీరు ఇవ్వడంతోపాటు భూగర్భ జలాలు పెరిగి రైతులు 12వేల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నారు. రూ.6,500 కోట్లతో నియోజకవర్గంలో ఐదు రిజర్వాయర్లు చేపట్టగా ఇప్పటికే రెండు రిజర్వాయర్ల పనులు 100 శాతం పూర్తయ్యాయి. చందంపేట మండలంలో పొగిళ్ల, కంబాలపల్లి, నేరేడుగొమ్ము మండలంలో అంబాభవానీ(పెద్దమునిగల్), పీఏపల్లి మండంలో అక్కంపల్లి, పెద్దగట్లు లిఫ్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అవి పూర్తయితే 12 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
నియోజకవర్గంలో ఇండ్లులేని పేదలకు వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఒక్క దేవరకొండ పట్టణ సమీపంలోనే 544 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. గృహలక్ష్మి పథకం కింద 3 వేల మందికి మంజూరు పత్రాలు అందజేశారు.
శ్రీశైలం సొరంగంలోని అంతర్భాగమైన నక్కలగండి ప్రాజెక్ట్‌ను రూ.435 కోట్లతో చేపట్టగా 95 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రాజెక్ట్ కింద ముంపుకు గురయ్యే రైతులను గుర్తించి నష్టపరిహారం అందించారు. నక్కలగండి ప్రాజెక్ట్‌తో పెండ్లిపాకల రిజర్వాయర్‌లోకి నీరు చేరి అక్కడి నుంచి అక్కంపల్లికి వెళ్తాయి.
దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూ. 5 కోట్లతో చేపట్టిన పార్కు పనులు చివరి దశలో ఉన్నాయి. దేవరకొండలో 100 కోట్లతో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకొని, మినీ పార్కులు ఏర్పాటు చేసుకొని పట్టణాన్ని సందరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకున్నారు.
ఉమ్మడి పాలనలో దేవరకొండ నియోజకవర్గం ఏ మాత్రం అభివృద్ధికి నోచలేదు. స్వరాష్ట్రంలో విద్య, వైద్యం, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పట్టణాలు, గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. నియోజకవర్గంలో మిగిలిపోయిన సాగునీటి పనులను పూర్తి చేసేందుకు తనను మరోసారి ఎమ్మెల్యేగా ఆశ్వీరదించాలి. సీఎం కేసీఆర్ సహకారంతో మున్ముందు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
-రమావత్ రవీంద్రకుమార్, దేవరకొండ ఎమ్మెల్యే