నల్లగొండ, నవంబర్ 28 : ‘నల్లగొండ మున్సిపాలిటీలో నేను చెప్పిన ప్రాంతాల్లోనే వైన్స్‌లు ఏర్పాటు చేయాలి. నా అనుచరులు, నావర్గానికి ఇబ్బంది లేకుండా చూడాలి. లేదంటే మీపై యాక్షన్ తప్పదు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్సైజ్ అధికారులను ఆదేశించాడట. దీంతో వాళ్లు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకొని తప్పనిసరిగా అమలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీలో వైన్స్ షాపులు దకించుకున్న వ్యక్తులు ఎకడైనా ఏర్పాటు చేసుకునే హకు ఉన్నది. ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంటరై తన అనుచరులకు ఇబ్బంది లేకుండా తాను చెప్పిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం సమీపంలో ఓ వైన్స్ చాలాకాలంగా నడుస్తోంది. అది ఈసారి ఒక వర్గానికి రావడంతో వాళ్లని వెంటనే అకడ నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.
దేవాలయం పకన వైన్స్ పెట్టొదని, అకడ నుంచి తీసేయాలని వార్నింగ్ ఇచ్చారు. వన్‌టౌన్ సమీపంలో ఉన్న వైన్స్ తన వర్గానికి చెందిన వ్యక్తులకు రావడంతో అకడ దవాఖానలు, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నా ఇబ్బంది లేదని, అకడే ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేశారు. కలెక్టరేట్ సమీపంలో ప్రస్తుతం నడుస్తున్న వైన్స్ మంత్రి అనుచరులకు రావడంతో అకడే మరోసారి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ఆ వైన్స్ సమీపంలో మహిళా ప్రాంగణానికి వెళ్లే దారిలో మరో వర్గానికి చెందిన వ్యక్తి ఇంకో వైన్స్ ఏర్పాటు చేసుకుంటుండగా అది అకడ వద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్సైజ్ అధికారులు అకడ వైన్స్ ఏర్పాటు చేయొద్దని యజమానికి చెప్పినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో మరో 12 నేను చెప్పిన ప్రాంతాల్లోని ఏర్పాటు చేయాలని, లేదంటే మీపై యాక్షన్ తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వైన్స్ యజమానులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
నల్లగొండ మున్సిపాలిటీలో ఎవరైనా ఎకడైనా వైన్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ సీఐ బూర ప్రసాద్ చెప్పారు. ఎవరు ఎకడ ఏర్పాటు చేసుకుంటున్నారనే విషయం మా దృష్టికి రాలేదన్నారు. కొత్తగా వైన్స్ దక్కించుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.