మోతే, ఏప్రిల్ 10 : కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండలో జరిగింది. ఉర్లుగొండ గ్రామానికి చెందిన కోళ్ల వీరభద్రం- పద్మ కుమారుడు కోళ్ల సాగర్, ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన సిరికొండ శ్రీలక్ష్మి ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. అయితే సాగర్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని, గర్భవతిని చేసి కాపురానికి తీసుకుపోవడం లేదని పేర్కొంటూ శ్రీలక్ష్మి శుక్రవారం అత్తింటి ముందు మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకొంటుంది.