యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో సర్వే నంంబర్ 322లో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌తోపాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి డిమాం డ్ చేశారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి ఫిర్యాదు చేశా రు. అనంతరం రామచంద్రారెడ్డి మీడియాతో మా ట్లాడుతూ చల్లూరు గుట్టలో అక్రమ మైనింగ్ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నదన్నారు. మైనింగ్‌కు ఎలాంటి అనుమతుల్లేవని ఆర్టీఐ దరఖాస్తుల్లో వెల్లడైందని చెప్పారు.
మ్యాపింగ్‌లో క్రషర్‌ను ఒకోసారి ఒక దగ్గర ఉన్నట్టు చూపించారని వివరించారు. ఎలాంటి పర్యావరణ అనుమతుల్లేకుండానే కొంతమంది నాయకులు ప్రకృతి సంపదను కొల్లగొడుతూ కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రేయింబవళ్లు అక్రమ బ్లాస్టింగ్ జరుగుతోందన్నారు. భారీ పేలు ళ్లు శబ్దాలకు చుట్టుపక గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌కు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు సంబంధం లేకపోతే ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషర్‌పై చర్యలకు ఎందుకు ఆదేశించడంలేదని ప్రశ్నించారు.
అక్రమ మైనింగ్ దందా వెనుక ఎంత పెద్దోళ్లున్నా అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సర్వే నం బరులో ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తునన్నారని, వారి వెనుక ఆలేరు ఎమ్మెల్యే ఉన్నాడని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. 15 రోజుల్లో స్పందించకుంటే హైవేపై నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకునే యత్నం..
చల్లూరు గుట్టల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, ప్రభు త్వ భూమి కబ్జాపై కల్లూరు రామచంద్రారెడ్డి నేతృత్వం లో ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు కార్యకర్తలు వచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెం దిన ఆ పార్టీ శ్రేణులు సుమారు 300మంది కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలో వారు లోపలకు వెళ్లకుం డా పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు గేట్లు తీసి కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కర్రె వెంకటయ్య, సట్టు తిరుమలేశ్, మాజీ జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, నాయకులు గుంటి కృష్ణ, ఎర్ర గోగుల జస్వంత్, నాగిర్తి గోపిరెడ్డి బొంగోని ఉప్పలయ్య గౌడ్, పల్లె సంతోశ్ గౌడ్, గోపగాని రామిండ్ల నరేందర్, యమ్మ భాసర్, ఎడ్ల నరేశ్ రెడ్డి, చెరుకు కనకయ్య, సోమలింగం గుప్తా, వరుణ్ రమేశ్, యమ్మ ఎల్లయ్య, తుంగ అక్షయ్ కుమార్, తుంగ వేణు తదితర నాయకులు పాల్గొన్నారు.