ఉత్తరప్రదేశ్‌లో రూ.4,200 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన లక్నో-కాన్పూర్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించి రెండు వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆ రహదారిపై పలు చోట్ల గుంతలు పడటం, కొద్దిపాటి వర్షానికే రహదారి దెబ్బతినటం, కుంగిపోవటం వంటివి వెలుగుచూస్తున్నాయి. దీంతో ఈ రహదారి నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జూలై 13న సీఎం యోగి ఆదిత్యానాథ్, కేంద్ర మంత్రులు, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీల చేతులమీదుగా ఈ రహదారి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. జూలై 25 నాటికి సీన్ మొత్తం మారిపోయింది.