భువనగిరి అర్బన్ జూన్ 3 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి పట్టణ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారని, ప్రభుత్వ మారిన అనంతరం ఇండ్లు అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటి నా పట్టణ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను నేటికీ లబ్ధిదారులకు అందజేయలేదన్నారు. దీంతో బుధవారం లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్లలోకి వెళ్లి గదులను శుభ్రం చేసుకున్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మా ట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు కేటాయించిన ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించకపోవడంతో తామే స్వయంగా మౌలిక వసతులు కల్పించుకుంటున్నామన్నారు. అద్దె ఇండ్లకు కిరాయిలు కట్టలేని స్థితిలో ఉన్నామని, ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరైనా మృతి చెందితే కిరా యి ఇండ్లలో ఉండనివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 ఆగస్టులో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తమకు పట్టాలు ఇచ్చారన్నారు. అయి తే ప్రభుత్వం మారడంతో ఇండ్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీంతో తాము గతంలో ఎమ్మార్వో, కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశామన్నారు. ప్రస్తుత భువనగిరి ఎమ్మెల్యే తక్షణమే పనులు చేయించి ఇండ్లు ఇస్తామని మాట ఇచ్చి సంవత్సరం దాటుతున్నా ఇంతవరకు పనులు పూర్తి కాలేదన్నారు.
గత నెలలో అధికారులు జూన్ 2న అందరి చేత గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో తామే సామూహికంగా గృహ ప్రవేశాలు చేసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పట్టణ కమిటీ కూడా తమకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చిందన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి వచ్చి లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి పనులు పూర్తికాలేదని, కలెక్టర్‌తో మా ట్లాడి గురువారం ఉదయం 11 గంటలకు పను లు పూర్తి చేయించి, తేదీ ప్రకటిస్తామని చెప్పడం తో లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు వెనుదిరిగారు. కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శుడు ఏవీ
కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు నాయికోటి నగేశ్, చీమల రాజు నాయకులు చెన్న మహేశ్, కాజా అజీముద్దీన్, ఏలె శివ, తాడూరు భిక్షపతి, ఎన్నబోయిన జహంగీర్, ఇక్బాల్ దరి, శాగంటి నరసింహ, కాజం, గుజ్జ పవన్, సిరిపంగ సుభాష్, వేముల కృష్ణ, నాగారం సూరజ్, అంజద్, రొయ్యల పవన్, చిన్న తదితరులు పాల్గొన్నారు.