అర్హులందరికీ సంక్షేమ పథకాలు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నార్కట్‌పల్లి, చౌడంపల్లి, చిట్యాల మండలంవట్టిమర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలనలో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు.
- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
కట్టంగూర్, జనవరి 2 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నార్కట్‌పల్లి, చౌడంపల్లి, చిట్యాల మండలంవట్టిమర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలనలో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన విధంగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమాల్లో నియోజకవర్గ స్పెష ల్ అధికారి కోటేశ్వరరావు, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, కమిషనర్ రాందుర్గారెడ్డి, ఎంపీపీలు బచ్చులపల్లి శ్రీదేవి, జెల్లా ముత్తి లింగయ్య, తాసీల్దార్లు స్వప్న, గుగులోతు ప్రసాద్ నా యక్, పద్మ, లాల్‌బహుదూర్, ఎంపీడీఓ దీన్ దయాళ్, పోరెళ్ల సునీత, లాజర్, యాదగిరి, జలందర్, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రత్యేకాధికారులు రావుల విద్యాసాగర్ పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
నియోజకవర్గంలోని కట్టంగూర్ మండలం మునుకుంట్ల, పరడ, బొల్లెపల్లి, నార్కట్‌పల్లి మండలం ఏడవెల్లి, బెండలపహాడ్, చౌడంపల్లి, నార్కట్‌పల్లి, నెమ్మాని, నకిరేకల్ మం డలం చందంపల్లి, గొల్లగూడెం, నెల్లిబండ, కేతేపల్లి మండలం చెరుకుపల్లి, గుడివాడ, చిట్యాల మండలం తాళ్లవెల్లెంల వట్టిమర్తి గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించారు.
పార్టీల కతీతంగా పథకాల అందజేత ; ఎమ్మెల్యే బీఎల్ఆర్
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి, దామరచర్ల మండలం దిలావర్పూర్, వేములపల్లి మండలం మొల్కపట్నం జరిగిన గ్రామ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీలు నందిని, సునీత, ఎంపీడీఓలు జ్యోతిలక్ష్మి, జానయ్య, కృష్ణమూర్తి, తాసీల్దార్లు హరిబాబు, శంకర్‌నాయక్, సర్పంచ్ నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటమ్మ పాల్గొన్నారు.
గ్రామ సభల పరిశీలన
దేవరకొండ /కొండమల్లేపల్లి : దేవరకొండ పట్టణంలోని 15వ వార్డు, కొండమల్లేపల్లి మండలంలోని దేవరోనితండా, చిన్నఅడిశర్లపల్లి గ్రామాల్లో గ్రామ సభలను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తనిఖీ చేశారు. అనంతరం దేవరోనితండా గ్రామంలో మిర్చి సాగును పరిశీలించారు. కారంపొడి తయారు చేసే పరిశ్రమను స్థాపించేందుకు ఎవరైనా ముందుకు వస్తే రూ.2 కోట్ల వరకు వడ్డిలేని రుణం అందజేస్తామన్నారు. ఆయన వెంట దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్ అలీ, ఎంపీడీఓ బాలరాజురెడ్డి, తాసీల్దార్ దివ్వారెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో..
హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నంది కొండ మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లో మంగళవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనుముల మండలం చింతగూడెం, పేరూరు, రామడుగు, త్రిపురారం మండలంలోని నీలాయిగూడెం, బాబుసాయిపేట, కంపాలపల్లి, వస్త్రంతండా, నిడమనూరు మండలంలోని ఊట్కూరు, వెంగన్నగూడెం, ముప్పారం, నిడమనూరు, గుర్రంపోడు మండలంలోని చామలేడు, బొల్లారం, నడికూడ, పల్లెపహాడ్, జిన్నాయిచింత తిరుమలగిరి సాగర్ మండలంలోని పెద్దబావితండా, గట్టుమీదితండా, తెట్టెకుంట, ధన్సింగ్తం డా, ఎల్లాపురం తండా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. కార్యక్రమంలో త్రిపురారం ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్, మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, తాసీల్దార్లు జయశ్రీ, గాజుల ప్రమీల, జంగాల కృష్ణయ్య, యాదగిరి, తౌఫిక్అహ్మద్, ఎంపీడీఓ గోళ్ల లక్ష్మి, అలువేలు మంగమ్మ, ప్రమోద్‌కుమార్, పల్ల్లెబోయిన రామలింగయ్య, ఖాజాఅజ్గర్ అలీ, శ్రీపాద సుధాకర్, దుర్గాప్రసాద్, ఏపీఓలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
మునుగోడు/ మర్రిగూడ : మునుగోడు మండలం గుండ్లోరిగూడెం, జమస్తాన్‌పల్లి, గంగోరిగూడెం, కిష్టాపురం, మర్రిగూడ మండలం వెంకెపల్లి,కమ్మగూడెం,లెంకలపల్లి,యరగండ్లపల్లి గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, ఎంపీడీఓ ఆర్.భాస్కర్‌గౌడ్, తాసీల్దార్ నరేందర్, ఏఓ శ్రీనువాస్‌గౌడ్, డీటీ నరేశ్, ఎంపీఓ సుమలత, మర్రిగూడలో ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్ రావు,తాసీల్దార్ బి.శ్రీనివాస్,డిప్యూటీ తాసీల్దార్ తారకారామన్, సూపరింటెండెంట్ యాకూబ్, ఏపీఎం హరి, ఏపీఓ వెంకటేశం పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని అడ్లూర్, మనిమద్దె, అంబారిపేట గ్రామాల్లో మంగళవారం ప్రజాపాలన నిర్వహించారు. అడ్లూర్ లో జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
నల్లగొండలో నాలుగో రోజు 13, 131 దరఖాస్తులు
నల్లగొండ నియోజక వర్గంలో దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. తొలి రోజు అంతంత మాత్రమే స్పందన కనిపించగా ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య పెరుగుతుంది. తొలి మూడు రోజులు నియోజకవర్గంలో 10, 185 దరఖాస్తులు రాగా నాలుగో రోజు మంగళవారం 13,131దరఖాస్తులు వచ్చాయి. నల్లగొండ మున్సిపాలిటీలో 6,998 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు మొత్తంగా 23,404 దరఖాస్తులు అందాయి. కనగల్ మండలంలో 1,408, తిప్పర్తి మండలంలో 1,540 దరఖాస్తులు అందాయి. నల్లగొండ మండలంలో 3,185 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఇప్పటి వరకు 36,892 దరఖాస్తులు అందనట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు నల్లగొండలోని పలు మండలాల్లో ఆర్డీఓ రవి పలు కేంద్రాల్లో ఈ దరఖాస్తులను పరిశీలింగా మున్సిపల్ కమిషనర్‌తో పాటు తాసీల్దార్లు, ఎంపీడీఓలు పలు కేంద్రాలను సందర్శించి దరఖాస్తు ప్రక్రియన పరిశీలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

