శాలిగౌరారం, జులై 03 : మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబడ్దార్ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ హెచ్చరించారు. గురువారం శాలిగౌరారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా టీవీ యాజమాన్యం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మానసిక క్షోభ పెట్టేలా మహా న్యూస్ అసత్య వార్తలు ప్రసారం చేసినట్లు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరన్నారు. కేసులకు తాము భయపడేది లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనపై నమోదైన 172 కేసులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నేడు తెలంగాణలో పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా పని చేస్తున్నరని, అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లలో దందాలు నడుస్తున్నాయన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని, ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని, గోదావరి, కృష్ణ బేసిన్ అంటే ఎందో కూడా తెల్వని పరమ సన్నాసి సీఎం రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ నాయకులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నరన్నరు. కాళేశ్వరo పేరుతో బదనాం చేస్తున్నారు. ఇప్పటికి కాళేశ్వరం మోటార్లు నడిపి నీళ్లు ఇవ్వొచ్చు. కానీ ఇవ్వరు.
ఇక ఈ కార్ రేస్ కేసులో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదు. అయినా పదే పదే విచారణ పేరుతో కేటీఆర్‌ని బదనాం చేసే కుట్ర చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇదొక డ్రామా. ఎవ్వరు ఇప్పటివరకు తమ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పడం లేదు. అయినా దాన్ని సాగబీకి కేసీఆర్‌ను బదనాం చేసే కుట్ర చేస్తున్నారు. ఆడవాళ్లని బజార్లోకి లాగి ప్రాపగండా చేస్తున్నారు. ఆడవాళ్లని రాజకీయాల కోసం బదనాం చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో ఎరువుల లేవు. విత్తనాలు లేవు. రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రైతు భరోసా కూడా అరకొరగా అమలైందని ఆయన పేర్కొన్నారు.