– ఈడబ్ల్యూఎస్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బహదూర్
– లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేత
కోదాడ, జనవరి 28 : సమాజంలో అట్టడుగు, అణగారిన వర్గాల అభివృద్ధికి ఈడబ్ల్యూఎస్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బహదూర్ తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ నివాసానికి సొసైటీ వ్యవస్థాపకుడు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆదేశాల మేరకు వెళ్లి రాజేష్ తల్లి లలితమ్మకు తక్షణ సహాయం కింద లక్ష రూపాయల చెక్కును అందజేశారు. రాజేష్ కుటుంబానికి భవిష్యత్లో కూడా తమ సంస్థ ద్వారా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు, అభాగ్యులకు తమ సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ కడమంచి సహదేవ్, ఈసీ మెంబర్లు మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్, నరేష్, స్థానిక నాయకులు ఏపూరి రాజు, గంధం యాదగిరి, కుడుముల లక్ష్మీనారాయణ, కాంపాటి పుల్లయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.