– ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి
– 18 మందితో తొలి జాబితా విడుదల
నల్లగొండ, జనవరి 28 : నల్లగొండ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ మున్సిపాలిటీని గతంలో కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ నల్లగొండను సుందర నగరంగా మార్చిందని తెలిపారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రూ.1300 కోట్లతో పట్టణంలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, త్రాగు నీరు, శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ట్రాఫిక్ జంక్షన్లు అభివృద్ధి చేసుకున్నట్లు చెప్పారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో వందల కోట్ల నిధులు తెచ్చి నల్లగొండను అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు.
నల్లగొండకు కార్పొరేషన్‌కు అర్హత వచ్చింది అంటే అందుకు బీఆర్ఎస్ చొరవే కారణం అన్నారు. అందరి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి క్యాంప్ కార్యాలయంగా మార్చుకున్నారన్నారు. ఫ్లై ఓవర్, ఔటర్ రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వసూలు చేసిన డబ్బులతో స్కూల్ కట్టి వాళ్ల పేరు పెట్టుకున్నట్లు దుయ్యబట్టారు. రూ.36 కోట్ల నిధులతో పట్టణంలోని ఎన్జీ కళాశాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చినట్లు, కళా భారతికి రూ.90 కోట్ల నిధులు శాంక్షన్ కాగా పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధి పనులకు టెండర్ ఎందుకు పిలువడం లేదని ప్రశ్నించారు. నల్లగొండ అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, నల్లగొండ అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
3వ డివిజన్ (ఎస్సీ మహిళా) – పేర్ల మల్లేశ్వరి అశోక్
7వ డివిజన్ (అన్ రిజర్వ్డ్ మహిళ) – మారగోని భవాని గణేశ్
9వ డివిజన్ (ఎస్టీ జనరల్) – బాగావత్ దీప్లా నాయక్
11వ డివిజన్ ( అన్ రిజర్వ్డ్ మహిళ) – దండంపల్లి సుజాత సత్తయ్య
13వ డివిజన్ (అన్ రిజర్వ్డ్) – గున్రెడ్డి రాధికా యుగేంధర్‌రెడ్డి
15వ డివిజన్ (ఎస్సీ జనరల్) – దొడ్డి రమేశ్
16వ డివిజన్ ( ఎస్సీ మహిళ) – ఏర్పుల తర్షణ రవి
17వ డివిజన్ (అన్ రిజర్వ్డ్ మహిళ) – మందడి లిఖితా సైదిరెడ్డి
20వ డివిజన్ (అన్ రిజర్వ్డ్ జనరల్) – ఎండీ.సలీం. సీపీఎం
21వ డివిజన్(అన్ రిజర్వ్డ్) – అఫ్జల్ ఖాన్
25వ డివిజన్ (అన్ రిజర్వ్డ్ మహిళ) – మాతంగి ఉమాదేవి
26వ డివిజన్ (బీసీ మహిళ) – నాజ్నీన్
27వ డివిజన్ (బీసీ మహిళ) – షమీన్ సుల్తానా- జమత్ ఖాద్రి
31వ డివిజన్ (అన్ రిజర్వ్డ్ మహిళ) – మిర్యాల జ్యోతి స్వామి
38వ డివిజన్ (బీసీ మహిళ) – అల్లి గౌతమి శివశంకర్
39వ డివిజన్ (బీసీ జనరల్) – అల్లి వేణు యాదవ్
42వ డివిజన్ (అన్ రిజర్వ్డ్ మహిళ) – ఎం.అనురాధా నాగరాజు
47వ డివిజన్ (అన్ రిజర్వ్డ్ మహిళ) – సింగం లక్ష్మీరామ్మోహన్

Nalgonda : ‘నల్లగొండ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తాం’