దామరచర్ల, జులై 07 : యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు డిమాండ్ చేశారు. దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో మాజీ ఎంపీటీసీ రాయికింది సైదులు ఆధ్వర్యంలో సోమవారం నిర్వాసితులు, రైతులతో ఆయన సమావేశమయ్యారు. తాళ్లవీరప్పగూడెంలో రైతులు నాడు భూ సేకరణకు అభ్యంతరం తెలిపితే అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాను ప్లాంట్ ఏర్పాటుతో జరిగే అభివృద్ధిని వివరించి స్థానికులను ఒప్పించి భూసేకరణ జరిగేలా చొరవ తీసుకున్నామని తెలిపారు.
కానీ ప్రస్తుత్త ప్రభుత్వం నిర్వాసితులకు అన్యాయం చేస్తుందని ఆక్షేపించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిర్వాసితులకు న్యాయం చేసేంత వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఎండీ. యూసుఫ్, అంగోతు హాతీరాం నాయక్, కటికం సైదులురెడ్డి, సోము సైదిరెడ్డి, దారగని వెంకటేశ్వర్లు, కొనకంచి సత్యనారాయణ, కొనకంచి నర్సయ్య, నల్లబద్దీ సైదయ్య, గోవిందు, కందుల నాగిరెడ్డి, ప్రకాష్ నాయక్, పర్షియా నాయక్, హానిమి రెడ్డి, నేనావత్ బాలూనాయక్, కొట్యానాయక్, వినోద్ నాయక్, అనిల్ నాయక్, సురేశ్ నాయక్ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Damracharla : వైటీపీఎస్ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తాం : మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు