చండూరు, అక్టోబర్ 18 : బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుంటే తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం చేస్తాం అని బీఆర్ఎస్ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. శనివారం చండూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ బంద్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే ఇప్పటికి వరకు రిజర్వేషన్లు అమలు అవుతున్నట్లు తెలిపారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేయకుండా బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందకుండా అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 42 శాతం బీసీ రిజర్వేషన్ ఆమోదం దిశగా అడుగులు వేయాలన్నారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కూరపాటి సుదర్శన్, అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్, కౌన్సిలర్ కోడి వెంకన్న, జుర్రిగల వెంకన్న, జగదీష్, పున్న సైదులు, బొల్లం అంజనేయులు,ఇరిగి రామన్న, గాలెంక రాంబాబు, ఇరిగి రామకృష్ణ, వీరమల్ల స్వామి, కిషన్, ఏల్వర్తి జగన్, లతీఫ్, గాలంక హరిబాబు, గాలింక శివాజీ, తలారి వంశీ, శివరాత్రి నవీన్, శివరాత్రి దుర్గాప్రసాద్, బీసీ నాయకులు పాల్గొన్నారు.